కలియుగంలో శ్రీఘ్రంగా అనుగ్రహించే దేవతామూర్తులలో ఆంజనేయస్వామి ఒకరు. ఆయన నామస్మరణ, చాలీసా పారాయణం వంటివాటితో శ్రీఘ్రంగా భక్తులను అనుగ్రహిస్తారు. అయితే ఆయా నెలల్లో కొన్ని ప్రత్యేక రోజుల్లో కొన్ని పూజలు చేస్తే మరింత ఎఫెక్టివ్గా ఉంటుందని పండితుల అభిప్రాయం. దీనిప్రకారం ఆయా మాసాలు, రోజుల గురించి తెలుసుకుందాం…
ఆంజనేయుని పూజకు
చైత్రమాసం- పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు, వైశాఖమాసం – ఆశ్లేషా నక్షత్రం, వైశాఖమాసం- కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి, జ్యేష్ఠమాసం- మఖా నక్షత్రం
జ్యేష్ఠశుద్ధ విదియ- దశమి,ఆషాఢ మాసం – రోహిణి నక్షత్రం, శ్రావణ మాసం – పూర్ణిమ, భాద్రపద మాసం – అశ్వనీ నక్షత్రం, ఆశ్వీయుజ మాసం – మృగశీర్షా నక్షత్రం, కార్తీక మాసం – ద్వాదశి, మార్గశీర్ష మాసం – శుద్ధ త్రయోదశి,
పుష్య మాసం – ఉత్తరా నక్షత్రం, మాఘ మాసం – ఆర్ధ్రా నక్షత్రం, ఫాల్గుణ మాసం – పునర్వసు నక్షత్రం, హస్త, మృగశీర్షా నక్షత్రములతో కూడిన ఆదివారములు స్వామి వారికి ప్రీతిదాయకములు. పూర్వాభద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. ప్రతి శనివారం స్వామివారికి పూజలు చేయుట విధి. అమావాస్యతో కూడిన సోమవారము, ప్రతి మంగళవారం స్వామి వారి పూజకు ప్రీతి దినములు. వైధృతియోగయు నందు (అనగా ఉత్తమము, అపూర్వము అగు గ్రహయోగకాలము, విష్కం భాది 27 యోగాలలో చివరిది వైధృతి యోగము) స్వామిని పూజించిన విశిష్ట ఫలసిద్ధి ప్రాప్తించును.
ఆంజనేయస్వామి సప్తపదనుడనియు, ఏకాదశ శీర్షుడనియు తెలియుచున్నది. శ్రీహనుమ త్స్యామికి అరటి తోటలంటే మిక్కిలి ఇష్టం. స్వామిని కదళీవనములందు పూజించిన శుభము చేకూరును. మంగళకరుడగు స్వామికి తమలపాకుల పూజ పరమ ప్రీతికరము.