దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజున చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా టపాసులు పేలుస్తూ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ ధన త్రయోదశి (ధన్‌తేరాస్) పర్వదినంతోనే ప్రారంభం అవుతుంది. ఈ ధన త్రయోదశి రోజున ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని పూజించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది ధర త్రయోదశి తేదీ , శుభ ముహూర్తం.. ధన త్రయోదశి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం అశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి లేదా ధన్ తేరాస్ అని పిలుస్తారు. ఈ రోజున ధన్వంతరికి , లక్ష్మీ అమ్మవారికి మట్టి దీపాలు వెలిగించి పూజ చేస్తారు. ఈ సాయంత్రం చేసే ఈ పూజ నుండి దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది. పంచాంగం ప్రకారం అక్టోబర్ 22వ తేదీ శనివారం రోజున ధన త్రయోదశి వచ్చింది. ఈ రోజున సాయంత్రం 7 గంటల 1 నిమిషాల నుంచి 8 గంటల 17 నిమిషాల వరకు శుభ ముహూర్తం ఉంది. ఆ సమయంలో ధన్వంతరి పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలూ సిద్ధిస్థాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వేర్వేరు శుభ ముహూర్తాలు ఉన్నాయి.
న్యూఢిల్లీలో రాత్రి 7:01కి మొదలై 8:17కి వరకు, చెన్నైలో రాత్రి 7:13కి మొదలై 8:13 వరకు, కోల్‌కతాలో సాయంత్రం 5:05 నుంచి 6:03 వరకు, బెంగళూరులో రాత్రి 7:24 నుంచి 8:24 వరకు, అహ్మదాబాద్‌లో రాత్రి 7:29 నుంచి 8:39 వరకు; ముంబైలో రాత్రి 7:34 నుంచి 8:40 వరకు; ఛండీగర్‌లో సాయంత్రం 6:59 నుంచి రాత్రి 8:18 కు గుర్గావ్‌లో రాత్రి 7:02 నుంచి 8:18 వరకు; హైదరాబాద్‌లో రాత్రి 7:14 నుంచి 8:18 వరకు; పుణేలో రాత్రి 7:31 నుంచి 8:36 వరకు ఉంటుంది.
హిందూ ధర్మం ప్రకారం గణ త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ధన త్రయోదశి రోజున ధన్వంతరి పూజ చేయటం వల్ల కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ ధన త్రయోదశి రోజున వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. వెళ్లి లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి సాయంత్రం అమ్మవారి పదాల దగ్గర వాటిని సమర్పించి..మట్టి దీపాలు వెలిగించి పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏడాది పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.