మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’. లాక్ డౌన్ మూలంగా ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈమధ్యనే చిత్రీకరణ ఊపందుకోవడంతో చిత్ర బృందం రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 13న సినిమాను రిలీజ్ చేస్తామని అఫీషియల్ ప్రకటన ఇచ్చేశారు. దీంతో చిరు కూడ శక్తికి మించి పనిచేశారు. ఆరు పదుల వయసులో కూడ డే అండ్ నైట్ షెడ్యూల్స్ చేశారు. కానీ ఒత్తిడి మరీ ఎక్కువ కావడంతో ఆయన ఆరోగ్యం కొంచెం డిస్టర్బ్ అయింది. సెట్లో ఆయన నీరసించిపోయారట. దీంతో రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన.
విడుదలకు గట్టిగా ఇంకో రెండు నెలలు మాత్రమే ఉంది. షూటింగ్ చాలావరకు ముగిసినా కూడ ఇంకా చాలా పని మిగిలివుంది. అది కూడ కంప్లీట్ కావాలంటే చిరు మునుపటి ఫామ్ చూపించాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆయన ఎన్ని రోజులు విశ్రాంతిలో ఉంటారో చెప్పలేం. ఒకవేళ సెట్స్ మీదకు వచ్చినా నిదానంగానే చేస్తారు తప్ప హడావుడి ఉండదు. అందుకే సమయానికి ఫస్ట్ కాపీ రెడీ అవ్వకపోవచ్చని, విడుదల తేదీ మారినా మారవచ్చని ఫిల్మ్ నగర్ టాక్. ఇక సినిమా బిజినెస్ విషయానికొస్తే భారీగానే జరిగింది. రికార్డ్ స్థాయి ధరలు పెట్టి హక్కుల్ని కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఇలాంటి టైంలో సినిమా వాయిదాపడే వీలుందని తెలియడంతో అందరూ డైలమాలో ఉన్నారు.