మనలో చాలామందికి హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాల గురించి సరైన అవగాహన ఉండదు. ఆచారాల పేరుతో పెద్దలు రకరకాల విషయాలను చెబుతుంటారు. కానీ ఆచారాల వెనక ఏ కారణం ఉంటుందో అని చాలామంది ఆలోచించరు. ఇలాంటి అనేక ఆచారాల్లో ఒకటి.. మాంసాహారం తింటే గుడికి వెళ్లకూడదు. ఇలా మాంసాహారం తింటే ఇంట్లో పూజ చేయకూడదని గుడికి వెళ్లకూడదని చెబుతుంటారు అయితే కొన్ని ప్రాంతాలలో దేవుడికి మాంసాహారమే నైవేద్యంగా పెడుతూ ఉంటారు. మరి మాంసం తిని గుడికి వెళ్లకూడదు అని చెప్పడం వెనక పెద్దల ఉద్దేశం ఏంటో, ఎందుకు అలా అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారం తింటే మనలోని రజో గుణం పెరుగుతుంది. అంటే మనలో కామం, కోపం రెండూ పెరుగుతాయి. మనకి వచ్చే కోపం మరియు కామ కోరిక వల్ల మనసుకు చంచలత్వం వస్తుంది. దీని వల్ల మనం ఏ పని పైన దృష్టి పెట్టలేము. అందుకే మాంసాహారం తిని గుడికి వెళ్లకూడదని పెద్దలు దీనిని ఒక ఆచారంగా తీసుకువచ్చారు. ఒకవేళ తిని గుడికి వెళ్లినా కానీ దేవుడి మీద ధ్యాస ఉండదని అందుకే ఆ సమయంలో గుడికి వెళ్లకూడదని పెద్దలు చెబుతుంటారు.
మాంసాహారాన్ని ఉపవాసం చేసేటప్పుడు కూడా దూరం పెడతారు. దేవుడిని ప్రార్థించే సమయంలో మన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉండకూడదని.. అన్ని నియంత్రణలో ఉంటేనే దేవుడు కూడా కరుణిస్తాడని పెద్దలు చెబుతారు. అయితే మాంసాహారంతో పాటు వెల్లుల్లి, ఉల్లి, మసాలాలను దూరంగా పెట్టాలని.. ఇవి కూడా రజో గుణాన్ని పెంచుతాయని అంటారు. అందుకే ఉపవాసవ చేసే వాళ్లు వీటికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అదే సమయంలోదేవుడిని ప్రార్థించే వారు సాత్విక గుణాన్ని పెంపొందించే ఆహారాలను తినాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా మాంసాహారం తిని గుడికి వెళ్లకపోవడానికి పెద్దలు తీసుకువచ్చిన సాంప్రదాయమే ఇది అని చెప్పాలి.