హిందూ ధర్మం ప్రకారం ఉదయాన్నే లేచి దేవుడిని పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుందని ప్రజల నమ్మకం. పూజా సమయంలో దేవుడికి పూలతో అలంకరించి పూజిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దేవుడు అనుగ్రహం లభించి ఎంతో పుణ్యం దక్కుతుంది అని నమ్మకం. అయితే అనేకమంది పూజ కోసమని ఉదయాన్నే పక్కవారి దొడ్లో పూలు కోస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే వాకింగ్ కి వెళుతూ ఒక కవర్ చేతిలో పట్టుకొని కనపడిన చెట్ల పూలన్నీ కోస్తూ ఉంటారు. అయితే ఇలా ఇతరుల ఇంట్లో ఉన్న పూలను కోసి దేవుణ్ణి పూజించటం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పక్క వారు పెంచుకున్న చెట్టు నుండి పూలను దొంగిలిస్తే మనకు పూజ చేసిన ప్రతిఫలం లభించదు. నిజానికి ఒక చెట్టు నుండి పూలు కోయడానికి ఆ యజమానికి కూడా హక్కు ఉండదు. ఆ యజమాని కూడా దేవుడి పూజ కోసం మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తం పూలు కోసేసి చెట్టుని బోడిగా ఉంచడం పాపం. వేరే వాళ్ల చెట్టులో నుండి పూలు కోసిన కూడా వారిని అడిగి కోసుకున్నా కూడా వారికి సగం పుణ్యం పోతుంది. దీని గురించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువు గరుడపురాణం లో గరుడికి ఒక శ్లోకం చెప్పారు.
పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివలన మోక్షం, ముక్తి కలగాలి, లేదా వచ్చే జన్మలో మరింత పుణ్యవంతమైన జీవితం కలగాలి. లేదా ఇక జన్మ లేవీ లేనివిధంగా ఆ భగవంతుడిలో ఐక్యమవ్వాలి. ఇవన్నీ కేవలం మనిషి జన్మలోనే సాధ్యం మరే ఇతర జన్మలోను ఇవేవీ సాధ్యపడవు. మరి పక్క వాల్ల పూలు కోసి చేసే పూజల వలన కలిగే పుణ్యం సంగతి పక్కన పెడితే, ఇలా చేయడం వలన తదుపరి జన్మలో అడవిలో కోతి లాగా పుడతారు. ఒక్క సారి మానవ జన్మ తప్పితే తిరిగి ఎన్నో వేల జన్మల తర్వాత గానీ మనిషి జన్మ సాధ్యపడదు. అలాంటపుడు ఇలాంటి పూజలు మనకి అవసరమా?? ఒక పది రూపాలు పెట్టి పూలు కొని దేవుడిని పూజిస్తే సరిపోతుంది కదా. ఇలా ఇతరుల ఇంటి నుండి పూలు దొంగలించి వాటితో పూజ చేయడం వల్ల పూజ చేసిన ప్రతిఫలం లభించకపోగా పాపం చుట్టుకుంటుంది.