సాధారణంగా మనిషి జీవన ప్రయాణంలో సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. అయితే జీవితంలో ఎదురయ్యే కష్టాలు నుండి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమంది ఆ కష్టాలనుండి బయటపడలేక పోతుంటారు. అలాంటివారు హనుమంతుడిని పూజించటం వల్ల వారి కష్టాలు ఆటంకాలను దూరం చేయవచ్చు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోవడానికి కలయుగ దైవం ఆ హనుమంతుడిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం రోజున ఆ హనుమంతుడిని పూజించటం వల్ల కష్టాలు తొలగిపోయి జీతం జీవితం సుఖంగా సాగిపోతుంది. ముఖ్యంగా జీవితంలో మనం చేసే పనిలో ఎదురయ్యే ఆటంకాలనుండి విముక్తి పొందటానికి ప్రతి మంగళవారం రోజు బెల్లం నూనె కలిపిన మిశ్రమంతో రావి ఆకుపై శ్రీరామ అని పేరు రాసి హనుమంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఆ హనుమంతుడి అనుగ్రహం పొంది మనం చేసే పనిలో ఆటంకాలు ఎదురవవు.
అలాగే ఇంట్లో ప్రతికూల శక్తి ఉండటం వల్ల కూడా కష్టాలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో హనుమంతుడికి ఇష్టమైన సింధూరం తో పూజ చేయాలి. అంతేకాకుండా ప్రతి మంగళ, శనివారాలలో హనుమంతుడికి శనిగలు, పచ్చిమిర్చి సమర్పించి పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి కష్టాలు దూరం అవుతాయి.
అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళ శని వారాలలో హనుమంతుడి ఎదుట నెయ్యి దీపం వెలిగించి పరమ పవిత్రమైన తులసిదళం సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. అలాగే ప్రతి మంగళ శనివారాలలో హనుమంతుడికి ఇష్టమైన మందారం, గులాబి, బంతి పువ్వులు,తమలపాకులతో అలంకరించి బెల్లం నైవేద్యంగా ఉంచి పూజించటం వల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి విజయం వరిస్తుంది.