కొత్త సంవత్సరంలో ఈ నియమాలు పాటించటం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం పొందవచ్చు..?

Get positive result for if make offerings to gods

సిరిసంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు. లక్ష్మీదేవి నియమనిష్టలతో పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు. అయితే కొంతమంది లక్ష్మీదేవిని పూజించినప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటివారు వారికి తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతూ ఉంటారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

• కొత్త సంవత్సరంలో ఎటువంటి కష్టాలు , ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషకరమైన జీవితం సాగించటానికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం. అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి బ్రహ్మ ముహూర్తంలో తలంటు స్నానం చేసి సూర్యోదయానికి ముందే ఇల్లు శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులతో చక్కగా అలంకరించి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలై మన ఇంట్లో ప్రవేశిస్తుంది.
• అలాగే చాలామంది మహిళలు ఇంటిని ఎప్పుడు దుమ్ము దూళితో ఉంచుకుంటారు. ఇలా దుమ్ము ధూళితో అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో దరిద్ర దేవత కొలువై ఉంటుంది. అందువల్ల ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
• ఇంటి ముఖ ద్వారం ఎదురుగా చెప్పులు వదలటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. అంతేకాకుండా ఇంటి ముఖద్వారానికి ఉన్న గడపని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందువల్ల పొరపాటున కూడా గడపని కాలుతో తనటం లేదా గడపకు అటూ ఇటూ కాలు ఉంచి మాట్లాడటం వంటి పొరపాట్లు చేయకూడదు.
• అలాగే ఎల్లప్పుడూ గడపకి పసుపు కుంకుమతో అందంగా అలంకరించి ఉంచాలి. ఇలా పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.
• సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది. అలాగే సాయం సంధ్య వేళల్లో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది.