ధన త్రయోదశి రోజున చీపురు కొంటె చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే?

దేశవ్యాప్తంగా అన్ని మతాల ప్రజలు భేద భావం లేకుండా దీపావళి పండుగను ఎంతో ఘనంగా, ఆనందంగా జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజున ప్రారంభమైన దీపావళి పండుగ భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. ధన త్రయోదశి రోజున కుబేరుడిని, లక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ధన త్రయోదశి రోజున వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ధన త్రయోదశి రోజున దానధర్మాలు చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

ధన త్రయోదశి రోజున వెండి లేదా బంగారు వస్తువులను కొనుగోలు చేసి లక్ష్మీదేవికి సమర్పించి మట్టి దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు. అలాగే ధన త్రయోదశి రోజున చీపురు కొనడం పురాతన కాలం నుండి సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ రోజున చీపురు కొనుగోలు చేయడానికి గల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

మత్స్య పురాణం ప్రకారం చీపురును లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అందువల్ల ప్రతిరోజు తెల్లవారకముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసే దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం. ఇలా ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు ధన త్రయోదశి రోజున కొనుగోలు చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం.

అందువల్ల ధన త్రయోదశి రోజున చీపురు తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఈరోజు నా చీపురు కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది శాంతి సంపదలతో పాటు కుటుంబం మొత్తం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్మకం. అందువల్ల తన త్రయోదశి రోజున తప్పకుండా చీపురు కొనుగోలు చేయమని నిపుణులు సూచిస్తున్నారు.