శని పూజ చేసిన తర్వాత స్నానం చేస్తున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే?

మనం ఏదైనా ఆలయానికి వెళ్లే ముందు సుచి శుభ్రంగా స్నానం ఆచరించి ఉతికిన దుస్తులను ధరించి ఆలయానికి వెళ్లి ఆ దేవదేవతలను నమస్కరించుకుంటాము.ఇలా అందరి దేవుళ్ళ మాదిరిగానే శనీశ్వరునికి కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శని దేవుడు మనం చేసే కర్మలకు అనుగుణంగా ఫలితాన్ని మనపై ఉంచడం వల్ల కొన్నిసార్లు కొందరు శని దోష ప్రభావంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ విధంగా శని దోష ప్రభావం ఉన్నవారు దోష నివారణ నిమిత్తం శనీశ్వరుడిని పూజించడం వల్ల దోషం తొలగిపోతుందని భావిస్తారు.

అయితే పండితులు చెప్పిన ప్రకారం శనీశ్వరునికి పూజ చేసిన అనంతరం శని దోషం తొలగిపోతుందని భావించి శనీశ్వరునికి పూజలు నిర్వహిస్తారు.ఇక శనీశ్వరుడిని పూజించిన తర్వాత చాలామంది శని ప్రభావం మనపై ఉండకూడదని భావించి ఇంటికి రాగానే స్నానం చేయడం చేస్తుంటారు. అయితే ఇలా స్నానం చేయడం మంచిదా కాదా అనే సందిగ్ధం మరికొందరిలో నెలకొంటుంది. అయితే శనీశ్వరునికి పూజ చేసిన అనంతరం తప్పనిసరిగా స్నానం చేయాలి అనే నిబంధనలు ఏమాత్రం లేదు.

అందరి దేవుళ్ళ మాదిరిగానే శని దేవుడు కూడా. ఆయన కేవలం మన కర్మలకు తగ్గ ఫలితాన్ని అందిస్తారే తప్ప ఎలాంటి చెడును కలిగించరు.అందుకే శనీశ్వరుడిని పూజించిన తర్వాత ఎవరు కూడా స్నానం చేయాల్సిన పనిలేదని,ఇలా స్నానం చేయటం వల్ల మనం చేసిన పూజకు ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు.కొంతమంది నవగ్రహాల పూజ చేసిన తరువాత కూడా నవగ్రహాలలో శనీశ్వరుడు కూడా ఉంటారు కనుక వెంటనే కాళ్లు కడుగుతూ ఉంటారు. ఇలా కాళ్లు కడగడం కూడా చేయకూడదు.నవగ్రహ పూజ చేసిన అనంతరం సరాసరి ఇంట్లోకి వెళ్ళటం వల్ల మనం చేసిన పూజకు ఫలితం దక్కుతుంది.