మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలు వారి ఇష్టదైవాన్ని ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు దేవాలయాలలో, ఇంట్లో ఇష్ట దైవానికి పూజలు చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభించి కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. ఇలా ప్రతి సోమవారం రోజున భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో శివుడిని పూజిస్తూ ఉంటారు. అడిగిన వరాలు ఇచ్చే శివుడిని భోళా శంకరుడు అని కూడా అంటారు. ఇక శివ అంటే మంగళం అని కూడా అర్థం వస్తుంది. అయితే చాలా మంది ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకోవాలా.. వద్దా.. అని చాలామంది సందేహిస్తుంటారు. అయితే ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించవచ్చా ? లేదా? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే శివ లింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చని పండితులు చెబుతున్నారు. కానీ కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకుని పూజించాలని అనుకునేవారు అంగుష్టమాత్రం పరిమాణంలో ఉండే శివలింగాన్ని మాత్రమే పెట్టుకోవాలి. అంగుష్టమాత్రం అంటే మన బొటన వేలి సైజు అన్నమాట. బొటన వేలి కన్నా ఎక్కువ పరిమాణంలో పరిమాణంలో ఉండే శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజించరాదు. అలాగే ఇంట్లో శివలింగాన్ని పూజించాలని అనుకునే వారు కూడా నియమనిష్టలతో ప్రతిరోజు పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా పూజలు చేయలేని క్రమంలో అశుభం జరుగుతుంది. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా నియమనిస్తులతో పూజ చేయగలమని భావించేవారు మాత్రమే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి.
ఇక శివ లింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చాలామంది ఇంట్లో శివలింగం పెట్టారు. అయితే శివ లింగానికి బదులు చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. సాలగ్రామ శిలారూప పెట్టుకున్నా కూడా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించాలి. ఇక వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో (మట్టితో) అప్పటికప్పుడు పార్థివ లింగం తయారుచేసుకుని శివున్ని అర్చించవచ్చు. ఇలా శివున్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.