సాధారణంగా చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడతారు. మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు దూరం అవుతాయని వాస్తు శాస్త్రంలో సూచించబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఉంచి పూజించటం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయి తులసి మొక్కతో పాటు మరికొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల కూడా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అలా ఇంట్లో నాటుకోవాల్సిన మొక్కలలో మనీ ప్లాంట్ కూడా ఒకటి. అయితే మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడానికి కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునేవారు వాస్తు నియమాలకు విరుద్ధంగా మని ప్లాంట్ నాటడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. మనీ ప్లాంట్ ను నాటేటప్పుడు పాటించవలసిన వాస్తు నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలో వివరించిన నియమాల ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలని భావించేవారు ఈ మొక్కను పొరపాటున కూడా ఈశాన్య దిశలో నాటకూడదు. ఇంట్లో ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. ఇలా చేయటం వల్ల ఎంతటి ధనవంతుడైన కూడా పేదవాడిగా మారిపోతాడు.
ఇంట్లో ఆగ్నేయ దిక్కును వినాయకుడి దిక్కుగా భావిస్తారు. అందువల్ల ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటడం మంచిది. ఆగ్నేయ దిశలో మని ప్లాంట్ నాటడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న కలహాలు తొలగిపోయి ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని ప్రజల నమ్మకం. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి లభిస్తుంది. ఇక మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకునేవారు ఆ మొక్క తీగను నేలకు తాగకుండా జాగ్రత్త పడాలి. మనీ ప్లాంట్ మొక్క నెలకు తాగటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మనీ ప్లాంట్ మొక్క పొరపాటున కూడా ఎండిపోకూడదు. కుటుంబ సభ్యుల జాగ్రత్త వల్ల మనీ ప్లాంట్ ఎండిపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. ఇలా ఎండిపోయిన మనీ ప్లాంట్ మొక్కను వెంటనే ఇంటి నుండి దూరంగా ఉంచాలి.