రాహుకాలంలో మొదలుపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతున్నాయా… అయితే పరిహారాలు పాటించండి..?

వాస్తు శాస్త్రం ప్రకారం రాహుకాలంలో ఏ పని కూడా చేయరు. ఎందుకంటే రాహుకాలంలో ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనులలో ఆటంకాలు ఏర్పడి మనం అనుకున్న పనులు నెరవేరవు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక సమయంలో రాహుకాలం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎనిమిదవ భాగంo రాహుకాలం ఉంటుంది. ప్రతి రోజు గంటన్నర సమయం పాటు రాహుకాలం ఉంటుంది. అయితే ఈ ఈ రాహుకాలంలో ఎటువంటి పనులు చేయకూడదు? ఒకవేళ రాహుకాలంలో ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే ఎటువంటి పరిహారాలు చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాహు కాలంలో చేయకూడని పనులు :

• మీరు రాహుకాలంలో పొరపాటున కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు.
• అలాగే రాహుకాలంలో ముఖ్యమైన పనికి సంబంధించిన ప్రయాణాలకు దూరంగా ఉండాలి.
• అలాగే పుట్టువెంట్రుకలు, ఉపనయన సంస్కారం, గృహ ప్రవేశం, వివాహం, నిశ్చితార్థం వంటి అన్ని శుభ కార్యాలు రాహుకాలంలో చేయకూడదు. ఒకవేళ చేసిన వాటికి ఆటంకాలు ఏర్పడుతాయి.
• అలాగే రాహుకాలంలో కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేయరాదు.
• అలాగే రాహుకాలంలో పూజలు, యాగాలు కూడా చేయరాదు.

రాహుకాల నివారణలు :

• మీరు రాహుకాలంలో ముఖ్యమైన పని చేయవలసి వస్తే ముందుగా హనుమాన్ చాలీసా పఠిస్తూ హనుమంతుడిని పూజించాలి. అలా హనుమంతుడిని పూజించిన తర్వాత పనులు ప్రారంభిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి.
• కొన్ని సందర్భాలలో రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వస్తుంది. అలాంటి సమయంలో ఇంటి నుండి బయలుదేరటానికి ముందు ఇంటినుండి వ్యతిరేక దిశలో 10 అడుగులు వేసి.. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకి వెళ్ళాలి.
• అలాగే రాహుకాలంలో ప్రయాణం మొదలు పెట్టాలనుకుంటే పెరుగు, పాన్ లేదా ఏదైనా తీపి తిన్న తర్వాత బయలుదేరాలి. అవి శుభానికి చిహ్నంగా పరిగణించబడతాయి.