పటిక బెల్లం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల ఆయుర్వేదంలో ఈ పటిక బెల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఈ పటిక బెల్లం తో ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా దూర చేయవచ్చునని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించిన కూడా ఏదో ఒక రూపంలో డబ్బు మొత్తం ఖర్చవుతూ ఉంటుంది. అందువల్ల ఇతరుల వద్ద అప్పు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఆర్థిక సమస్యలు పెరిగిపోయి సతమతమవుతూ ఉంటారు. అయితే ఈ ఆర్థిక సమస్యలకు వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల చిట్కాలను వివరించారు. ఆ చిట్కాలతో పాటు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం. పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతాయి. పటిక బెల్లం ఇంట్లో ఉండటం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు. ఈ పటిక బెల్లం ఉపయోగించి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో తరచూ జరిగే గొడవలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం పట్టిక బెల్లం వేసి ఇంట్లోనే ఒక మూలలో దీనిని ఉంచడం వల్ల తరచూ ఇంట్లో జరిగే గొడవలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది.
అంతేకాకుండా కొన్ని సందర్భాలలో వాస్తు దోషం వల్ల కూడా తరచూ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో 50 గ్రాముల పట్టిక బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి పూజ గదిలో ఉంచటం వల్ల సమస్యలు తొలగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత చేకూరుతుంది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది . శుక్రవారం రోజున పూజ గదిలో పటికబెల్లాన్ని ఉంచి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ధన ప్రాప్తి కలుగుతుంది.