శ్రీకనకదుర్గమ్మ నవరాత్రులు అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం !

2020 th year kanakadurga navaratrulu starts from october 17

విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 25 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పైలామినాయుడు తెలిపారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్లను ఛైర్మన్, ఈవో విడుదల చేశారు. 9 రోజులకు సంబంధించి ఉచిత, రూ.100, రూ.300 టికెట్లను విడుదల చేశారుజ.

  2020 th year kanakadurga navaratrulu starts from october 17

2020 th year kanakadurga navaratrulu starts from october 17

ఇంటికే అమ్మవారి ప్రసాదం
ఈ సంవత్సరం అన్ని సేవా టికెట్లను ఆన్లైన్లో ఉంచినట్లు తెలిపారు. ఆన్లైన్లో ఏ దేశంలో ఉండి అయిన సేవా టికెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. సేవ టికెట్ బుక్ చేసుకున్నవారికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, అమ్మవారి దస్త్రం వారి ఇంటికి పంపిస్తామని వెల్లడించారు.