చిరంజీవిగా పుట్టి 44 ఏళ్లు అయ్యింది.. ఎమోషనల్ అయిన మెగాస్టార్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. ఈయన స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎవరి ఆదరణ లేకుండా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.ఇలా ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22వ తేదీకి విడుదల అయ్యి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకుని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ జన్మలో మీ రుణం తీర్చలేనిది అంటూ అభిమానుల పట్ల ఆయన కృతజ్ఞతా భావం తెలియజేశారు. మీకు తెలిసిన ఈ చిరంజీవి పుట్టిన ఇంటికి 44 సంవత్సరాలు అయింది.22 సెప్టెంబర్‌ 1978. ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి.. ప్రాణప్రదంగా నా ఊపిరై.. నా గుండె చప్పుడై అన్ని మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపింది.

నన్ను ఇంతలా ఆదరించి అభిమానించిన ప్రేక్షకుల, అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనట్టు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన మొదటి సినిమా గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.