చరణ్ బన్నీలను ఫాలో అవుతున్న నాని.. మరి వారిలా సక్సెస్ అవుతారా?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోలు తమ ట్రెండ్ పూర్తిగా మార్చేస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి విభిన్నమైన గెటప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఉన్నటువంటి హీరోలు తమలో మాస్ యాంగిల్ కూడా ఉందంటూ బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇలా ఒక్కసారిగా మాస్ ఇంటెన్సివ్ లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే ఇప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్నటువంటి హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తో ఒక్కసారిగా తనలో ఉన్నటువంటి మాస్ క్యారెక్టర్ బయట పెట్టారు.

అదేవిధంగా మెగా హీరో రామ్ చరణ్ సైతం ఎన్నో సినిమాలలో లవర్ బాయ్ గా కనిపించినప్పటికీ రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రలో మాస్ క్యారెక్టర్ లో నటించి బాక్సాఫీస్ వద్ద హిట్ సొంతం చేసుకున్నారు.ఇకపోతే అల్లు అర్జున్ సైతం పుష్ప సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు.ఈ విధంగా మాస్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ హీరోలు మంచి హిట్ అందుకున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి పాత్ర ద్వారా నాచురల్ స్టార్ నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్నటువంటి చిత్రం దసరా. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 30 తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నాని లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే విడుదలైన పోస్టర్లను బట్టి తెలుస్తుంది ఇందులో ఈయన పొడవు గడ్డం పూర్తయిన జుట్టు మాసిపోయిన బట్టలతో ఫుల్ మాస్ క్యారెక్టర్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే రామ్ చరణ్ అల్లు అర్జున్ తరహాలో మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నటువంటి నాని వారిలాగే దసరా సినిమాతో హిట్ అందుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.