హిందువుల అతి పెద్ద పండుగ సంక్రాంతి. అంతేకాక ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా ఇదే అంటారు మన పూర్వికులు. ఈ సమయంలో చేసే దానధర్మాలు, పూజలు గొప్ప ఫలితాన్నిస్తాయని అంటుంటారు పెద్దలు. అందుకే ప్రతి రాశివారూ తమ గ్రహబాధల నుంచి తప్పించుకోవాలంటే ఈ దానాలు తప్పక చేయాల్సిందే. అలాగే చాలా మంది శాస్త్రవేత్తలు సంక్రాంతికి తప్పకుండా దానం చేయమని సూచిస్తున్నారు. మరి ఏ రాశివారు ఎలాంటి దానం చేస్తే, గ్రహాల అనుగ్రహం పొందడానికి ఏయే దానాలు చేయాలో పండితులు చెప్పిన విషయాల గురించి ఒకసారి చూద్దాం.
మేషరాశి : ఈ రాశివారు మకర సంక్రాంతికి నువ్వులు, బెల్లం దానం చేస్తే చాలా మంచిదిని అంటున్నారు.
వృషభరాశి : ఈ రాశివారు నువ్వులతో పాటు దుస్తులు దానం చేయాలని చెబుతున్నారు.
మిధునరాశి : గ్రహశాంతి కోసం నువ్వులు దానం చేసేటప్పుడు నల్లనువ్వులనే దానం చేస్తారు. కానీ మిధునరాశి వారు సంక్రాంతికి తెల్లనువ్వులని దానం చేస్తే మంచిదట. వీటితో పాటు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కూడా దానం చేస్తే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు.
కర్కాటకరాశి : వీళ్లు నువ్వులతో పాటు సగ్గుబియ్యం, వస్త్రాలని దానం చేయాలి.
సింహరాశి : ఈ రాశివారు నువ్వులు, బెల్లం, వస్త్రాలను దానం చేయాలని సూచిస్తున్నారు.
కన్యారాశి : వీళ్లు మినుములు, నువ్వులు, నూనె దానం చేస్తే గ్రహబాధలు తీరిపోతాయన్నది పెద్దల మాట.
తులారాశి : ఈ రాశివారు నూనె, నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేస్తే మంచిది.
వృశ్చికరాశి : సంక్రాంతి సమయంలో నువ్వులు, బియ్యం దానం చేస్తే ఈ రాశివారికి మంచి జరుగుతుందని చెబుతున్నారు.
ధనుస్సురాశి : ఈ రాశివారు సంక్రాంతికి శనగలు, నువ్వులు దానం చేయాలి.
మకరరాశి : నూనె, నువ్వులు, వస్త్రాలని దానం చేయడం వల్ల ఈ రాశివారికి మంచి జరుగుతుంది.
కుంభరాశి : ఈ రాశివాళ్లు దువ్వెన, నూనె, నువ్వులు, నల్లటి వస్త్రాలను సంక్రాంతి సమయంలో దానం చేయాలి.
మీనరాశి : శనగలు, సగ్గుబియ్యం, నువ్వులు, వస్త్రాలను దానం చస్తే ఈ రాశివారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
వీటితో పాటు ఆడవారు సంక్రాంతి సమయంలో పసుపుకుంకుమలు, పళ్లు దానం చేస్తే… జీవితం సజావుగా సాగిపోతుందన్నది పెద్దల మాట. ఏది ఏమైనప్పటికీ ఈ పండగకి ఎంత దానం చేస్తే అంత కలిసొస్తదని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఎక్కువశాతం మనకుండే ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఎక్కువగా నువ్వులను దానం ఇస్తారు. అది కూడా శనివారం పూట చూసుకుని ఇస్తారు.