Sobhita: సినీనటి శోభిత అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను ప్రేమించి గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం తర్వాత మొదట జరుపుకుంటున్నటువంటి పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి కావటం విశేషం.
ఈ సంక్రాంతి పండుగను సెలబ్రిటీలు అందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శోభిత సైతం సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలపై నేటిజన్స్ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ ఫోటోలలో భాగంగా చైతన్య శోభిత ఇద్దరు కూడా సాంప్రదాయంగా దుస్తులను ధరించి ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు అయితే ఈమె తన పాదాలు అలాగే చైతన్య పాదాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు అయితే ఈ ఫోటోలలో శోభిత పాదాలకు మెట్టెలు లేకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. పెళ్లయిన రెండు నెలలకే శోభిత ఇలా మెట్టెలు తీసేయడంతో నేటిజన్స్ భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
పెళ్లి సమయంలో శోభిత హిందూ సాంప్రదాయ వ్యవహారాల గురించి గొప్ప గొప్పగా మాట్లాడారు అయితే పెళ్లైన రెండు నెలలకే తన సాంప్రదాయాలను పక్కన పెట్టేసారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక పెళ్లి సమయంలో శోభిత కాళ్లకు నాగచైతన్య మెట్టెలు పెడుతున్న సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యారు మరి అప్పుడే మెట్టెలు తీసేయడం ఏంటి శోభిత… రోజు కాకపోయినా కనీసం పండగ పూట అయినా మెట్టెలు పెట్టుకోవచ్చు కదా అంటూ నేటిజన్స్ ఈమె వ్యవహార శైలిపై భారీగా విమర్శలు చేస్తున్నారు.