Home News ప్రియుడి కోసం.. కాబోయే భర్తను చంపించిన యువతి..!!

ప్రియుడి కోసం.. కాబోయే భర్తను చంపించిన యువతి..!!

పెద్దలు కుదిర్చిన సంబంధం ఆ యువతికి ఇష్టం లేదు. తానో వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లోనూ, ఆ అబ్బాయికి చెప్తే బాగుండేది. కానీ.. తన ప్రేమ విషయం ఎవరికీ చెప్పలేదు. ప్రేమించిన వ్యక్తి కోసం పెద్దలు చూసిన వ్యక్తిని పార్టీకి పిలిచి ప్రియుడితో కలిసి చంపించేసింది. దారుణమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పోలీసుల విచారణలో వెల్లడైన ఈ దారుణమైన సంఘటనా వివరాలు..

T 7Db4C0Ab9D6B42F9A0D9Cc26E1A7B364 Name Be68568Fb721439A8887B899B94Ce359 | Telugu Rajyam

ఉత్తరప్రదేశ్ లోని మోహనాలాల్‌గంజ్ కు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన షానే అలీ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ.. యువతి కుటుంబ సభ్యులు బంత్ర ప్రాంతానికి చెందిన షాబుద్దీన్‌తో వివాహం నిశ్చయించారు. అయితే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆ యువతికి ఇష్టం లేదు. ప్రియుడంటే ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక పెద్దలు కుదిర్చిన యువకుడినే చంపేయాలని ప్రియుడు షానే ఆలీతో కలిసి పథకం వేసింది.

తన బర్త్ డే రోజునే షాబుద్దీన్ ను చంపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తన పుట్టినరోజు మార్చి 11న వేడుకలకు షాబుద్దీన్ ను పిలిచింది. పార్టీకి వెళ్లిన షాబుద్దీన్ కు పథకం ప్రకారం ఫూటుగా మద్యం తాగించారు. షాబుద్దీన్ పూర్తిగా మత్తులో ఉన్నాడు. ఇదే అదనుగా షానే అలీ తన మిత్రులతో కలిసి షాబుద్దీన్ ను కత్తులతో పొడిచి, కుక్క బెల్ట్‌ను మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం షాబుద్దీన్ మృతదేహాన్ని బాబుఎర గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అయితే.. పార్టీకి వెళ్లిన షాబుద్దీన్ ఎంతకీ రాకపోవడంతో అతడి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన కుమారుడు తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు యువతిపై అనుమానం వచ్చింది. విచారించగా తనకేమీ తెలీదని చెప్పింది. కానీ.. పోలీసులకు వచ్చిన అనుమానంతో యువతి ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. విచారణలో ఆమెకు ప్రియుడు ఉన్నాడని తేలింది. దీంతో తమదైన శైలిలో విచారించగా ఆ యువతి అసలు విషయం చెప్పింది. షాబుద్దీన్ తామే చంపినట్టు అంగీకరించింది. దీంతో యువతి ఆమె ప్రియుడిపై మర్డర్ కేసు నమోదు చేసారు. మరో ఆరుగురిని అరెస్టు చేశారు.

 

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

Latest News