సిగ్గుగా ఉంది మేడం: కవితకు చేనేత యువకుడి ట్వీట్

యాదగిరిగుట్ట, చేనేత కుటుంబానికి చెందిన కిషోర్ అనే యువకుడు కవితకు ట్విట్టర్లో తన గోడు వెళ్లబోసుకుంటూ ఒక ట్వీట్ పెట్టాడు. అతని ట్వీట్ చూసిన ఎంపీ కవిత సానుకూలంగా స్పందించింది. కిషోర్ సంవత్సరం కిందట ప్రమాదవశాత్తు కుడి మోకాలు పైభాగం వరకు కోల్పోయాడు. ఎడమకాలు కూడా సరి లేదు. దీంతో కుటుంబంపైనే ఆధారపడ్డాడు.

24 ఏళ్ళ వయసున్న కిషోర్ తల్లిదండ్రులకు బాసటగా ఉండాల్సిన సమయంలో అతనే కుటుంబంపై ఆధారపడటం అతన్ని కలచి వేస్తుంది. దీంతో తనకి ఏదైనా ఆర్ధిక సహాయం కానీ, గ్రామా చుట్టు ప్రక్కల కానీ ఉపాధి అవకాశం కానీ కల్పించామంటూ కవితకు ట్వీట్ పెట్టాడు.

 

“మేడం నా వయసు 24 . ఇప్పటి వరకు నన్ను పోషించిన నావాళ్లకు భారంగా ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది మేడం. ఇప్పుడు వారిపై ఆధారపడాల్సి వస్తుంది. నేతన్న చేయూత పథకం ద్వారా నెలకు 1000 రూపాయలు కడితే 2000 జమ అవుతుంది కానీ ఆర్ధిక పరిస్థితి కారణంగా ఆ స్కీమ్ ని వినియోగించుకోలేక పోతున్నాం. మావాళ్లకు దూరంగా వెళ్ళలేను. మాగ్రామానికి దగ్గరలో ఏదైనా ఉపాధి అవకాశం కానీ సహాయం కానీ చేస్తారని ఆశగా ఉంది మేడం”. అంటూ కిషోర్ ట్వీట్ చేసాడు.

“అతను చేసిన ఈ ట్వీట్ పై సానుకూలంగా స్పందించింది ఎంపీ కవిత. ధైర్యంగా ఉండు కిషోర్. నీకు సంబంధించిన పూర్తి వివరాలు 8985699999 నెంబర్ కి పంపించు. నీ కాళ్లపై నువ్వు బ్రతకటానికి మేము సపోర్ట్ చేస్తాం” అంటూ ట్వీట్ చేసింది కవిత.