టీవీ ఛానల్ ప్లానింగ్ లో ఉన్న బండ్ల గణేష్.. ఛానల్ ప్రారంభించేది అప్పుడేనా?

బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా పవన్ కళ్యాణ్ తన దేవర అంటూ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని చూపిస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇక ఈయన ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం ఈయన ఎలాంటి సినిమాలలో నటించకపోయిన ఎలాంటి సినిమాలను నిర్మించకపోయినా తరచూ సినిమాల గురించి రాజకీయాల గురించి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక బండ్ల గణేష్ మైక్ చేత పట్టుకున్నారంటే తప్పనిసరిగా ఒక వివాదం చెలరేగుతుందని అందరూ భావిస్తారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన ట్విట్టర్ వేదికగా స్టార్ మా వార్షికోత్సవం సందర్భంగా ఈయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పై ఒక నెటిజన్స్ స్పందిస్తూ అన్న మీరు కూడా ఒక టీవీ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటూ కామెంట్ చేశారు.ఇలా నేటిజన్ చేసిన కామెంట్ పై బండ్ల గణేష్ స్పందిస్తూ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాను బ్రదర్ అంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా ఈయన టీవీ ఛానల్ గురించి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే పలువురు నేటిజన్ లు స్పందిస్తూ ఒకవేళ బండ్ల గణేష్ ఛానల్ ప్రారంభించిన ఏ పార్టీ తరఫున చానల్ ప్రారంభిస్తారు అంటూ చర్చలు మొదలుపెట్టారు.

ఒకవేళ ఈయన టీవీ ఛానల్ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ తరపున ఛానల్ ప్రారంభిస్తారా లేదా టీఆర్ఎస్ తరఫున ప్రారంభిస్తారా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలవుతున్నాయి. సాధారణంగా బండ్ల గణేష్ ఒక న్యూస్ డిబేట్ లో పాల్గొంటేనే పెద్ద ఎత్తున రచ్చ చేస్తారు అలాంటిది ఏకంగా తానే ఒక టీవీ ఛానల్ పెడితే ఇంకా ఎలాంటి వాతావరణ పరిస్థితులు తలెత్తుతాయో మనకు తెలిసిందే. అయితే ఈయన వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి టీవీ ఛానల్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే బండ్ల గణేష్ ఈ విషయంపై స్పందించి అసలు విషయం తెలియజేయాల్సి ఉంటుంది.