యాదాద్రి జిల్లాలో బస్సు-లారీ ఢీ, ఇరుక్కుపోయిన డ్రైవర్లు (వీడియోలు)

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద  లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ, బస్సు బలంగా ఢీకొనడంతో లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్ వాహనాలలోనే ఇరుక్కు పోయారు. బస్సులోని ప్రయాణికులు కూడా ఇందులో ఇరుక్కుపోయారు. అతి కష్టం మీద వారిని పోలీసులు, స్థానికులు బయటికి తీశారు. అదృష్టవశాత్తు అంతా గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసి బస్సు భూపాలపల్లి డిపోకు చెందినది. ఈ ప్రమాదంలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు, లారీ ప్రమాద దృశ్యాలు కింద ఉన్నాయి చూడండి.