చెట్టు మీంచి పడి తల్లడిల్లిన గౌడన్న (వీడియో), చివరకు మృతి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో విషాదం జరిగింది. తాటిచెట్టుపై నుంచి పడి గీతా కార్మికుడు పొట్లపల్లి అయ్యన్న గౌడ్ మృతి చెందాడు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాటి చెట్లన్ని తడిచి ఉన్నాయి. తాళ్లకు గీత పోతుందనే ఉద్దేశ్యంతో సోమవారం ఉదయం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా కాలు జారి చెట్టుపై నుంచి అయ్యన్న కింద పడ్డాడు. శరీరానికి బలమైన గాయాలు కావడంతో  తల్లడిల్లిన అయ్యన్న ఆసుపత్రికి తరలించే లోపే తాటి చెట్టు వద్దే మృతి చెందాడు. అయ్యన్న కింద పడగానే ప్రాణాలతో ఉండగా తీసిన వీడియో కింద ఉంది చూడండి.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. నవ్వుతూ వెళ్లిన మనిషి ప్రాణాలు వదలడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. అయ్యన్న పేద కుటుంబానికి చెందిన వాడని అతని కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని గౌడ సంఘం నేతలు, అన్ని పార్టీల వారు ప్రభుత్వాన్ని కోరారు.

విగత జీవిగా మారిన అయ్యన్న గౌడ్