ఐపీఎస్ కావాలనుకుంది కానీ… ఆ కారణంతో తనువు చాలించిన గీతాంజలి

“జీవితంలో కలలు కనండి. వాటి సాకారానికి  యత్నించండి అని చెప్పిన అబ్దుల్ కలాం మాటలు ఆదర్శంగా తీసుకున్నాను. కానీ నా కలలు.. కల్లలుగానే మిగిలిపోయాయి. చిన్నప్పుడే పెళ్లి చేస్తే చిక్కులు పోతాయని అనుకున్నారు కన్నవాళ్లు.. కానీ వారి చిక్కులే నాకు చక్రబంధాలు అవుతాయని అనుకోలేదు  ఇది ఎవరో గొప్ప మేధావులుల రాసినట్టు ఉంది కదా. కానీ ఇది తన జీవిత లక్ష్యం చేరుకోలేకపోయానని దానికి నా పెళ్లే కారణమని” జీవితంలో ఓడిపోయిన గీతాంజలి అనే అభాగ్యురాలు తన సూసైడ్ నోట్ లో రాసింది.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన నర్సయ్య, లక్ష్మీ దంపతుల బిడ్డ గీతాంజలి. ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడే కడెం మండలం లక్ష్మీపురానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వాస్తవానికి గీతాంజలికి పెళ్లి ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లి చేసుకుంది. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ అయ్యి పెద్ద పోలీసాఫీసర్ కావాలని గీతాంజలి లక్ష్యం పెట్టుకుంది. పెళ్లయ్యాక భర్త సహకరిస్తే తన లక్ష్యం నెరవేర్చుకోవచ్చనుకుంది.

ఈ లోగా వారికి వర్ణిత్, వైశ్విక్ అనే ఇద్దరు కుమారులు పుట్టారు. భర్త శంకర్ మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. గీతాంజలి చైతన్యపురిలోని రామలింగేశ్వర కాలనీలో పిల్లలతో కలిసి ఉంటుంది. పిల్లలు స్కూల్ కు వెళ్లగానే ఆమె దిల్ సుఖ్ నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో ఎస్సై కోచింగ్ తీసుకుంటుంది.

భర్త తనకు సహకరించకపోవడం, అనుకున్న లక్ష్యానికి కుటుంబ బాధ్యతలు అడ్డు రావడంతో మానసికంగా కుంగిపోయింది. ఎక్కువ వయసు ఉన్న వ్యక్తితో పెళ్లి చేయడం, ఆయన అర్ధం చేసుకోకపోవడం కూడా ఆమె ఆత్మహత్యకు కారణమైనట్టు తెలుస్తోంది. 25 ఏళ్ల జీవితంలోనే 100 ఏళ్ల జీవితం కనిపించిందని ఇక తాను బతకడం అనవసరమని లేఖలో గీతాంజలి రాసింది. తన పిల్లలను బాగా చూసుకోవాలని గీతాంజలి మామను కోరింది. 

Women commits Suicide over family problems in Hyderabad - Sakshi

తల్లిదండ్రులు ఆడపిల్లల మనసులను అర్ధం చేసుకోవాలని కోరింది. చిన్నతనంలో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలు ఆగం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. లక్ష్యం నెరవేరకపోవడం, భర్త సహకారం లేని కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా లేఖలో తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.