బిగ్ బాస్ కు నానీ గుడ్ బై చెబుతాడా?

బిగ్ బాస్ నిర్వహిస్తున్న నానీ అంత హ్యాపీ గా లేడని వార్తలొస్తున్నాయి.నాని అసలే మెతక. అంత మెతకగా బిగ్ బాస్ ను నిర్వహిస్తున్నందువల్ల ఆయన రక్తి కట్టించలేకపోతున్నారని,  హౌస్ లో జరిగే కార్యకలాపాల వల్ల వ్యవహారం ముందుకు సాగుతూ ఉందని ఫీడ్ బ్యాక్ వచ్చిందని తెలిసింది. దీని వల్ల ఆయనకు, బిగ్ బాస్ నిర్వాహకులకు చర్చ సాగిందని, ఫలితంగా ఆయన నిష్క్రమించాలనుకుంటున్నాడని విశ్వసనీయ సమచారం. అయితే, నిర్వాహకులు ఆయన్ని వారించి కొనసాగించేటట్టు చేశారని తెలిసింది.

సోషల్ మీడియా బిగ్ బాస్ బాగా చర్చనీయాంశమయింది.  అయితే, నాని  యాటిట్యూడ్ కూడా చర్చకు వస్తున్నది. ఆయన కొందరి మీద కటువుగా ఉంటున్నారని, మరికొందరి మీద మెతకగా ఉంటున్నారని విమర్శలొస్తున్నాయి. ఇదే వివాదానికి దారితీసిందని అంటున్నారు.

 మొదట్లో కొంత బోర్ గా అనిపించిన క్రమంగా రక్తి కడుతూ ఉందని అనుకుంటున్న సమయంలో ఇపుడిలాంటి వార్తలు వెలువడతున్నాయి.దీని   రెండు మూడు రోజులలో నాని నుంచి గాని, బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి గాని వివరణ వస్తుందని అనుకుంటున్నారు.