భార్య, ప్రియుడు కలిసి అడ్డుగోడ భర్త ను…

అక్రమ సంబంధాలు కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. భార్యలు భర్తలను చంపుడూ.. భర్తలు భార్యలను చంపుడూ… ఫ్యాషనైపోయింది. సినిమాలని మించిన విధంగా పక్కా ప్రణాళికలతో హత్యలు చేస్తున్నారు. కట్టుకున్నవారు అన్న ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నారు. నాగరు కర్నూల్ స్వాతి ఉదంతం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అటువంటి సంఘటనే రాజధాని శివారులో జరిగింది. వివరాలేంటంటే…

వికారాబాద్ జిల్లా బొమ్మరాస్ పేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, మహేశ్వరి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు రాజేంద్రనగర్ లో ఉంటున్నారు. ఆనంద్  ఓ హోటల్ లో పని చేస్తుండగా, మహేశ్వరి ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తుంది. మహేశ్వరికి గండిపేట మండలం గంధంగూడ గ్రామానికి చెందిన సంజీవ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన మహేశ్వరి భర్త ఆనంద్ ను చంపాలని ప్లాన్ వేసింది. మే 7న ఆనంద్ తాగి ఇంటికి వచ్చి పడుకున్నాక మహేశ్వరి, సంజీవ్ లు కలిసి గొంతు నులిమి ఆనంద్ ను చంపేశారు. ఆ తర్వాత సంజీవ్ ఆటోలో తీసుకెళ్లి గందంవారిగూడెంలోని సంజీవ్ భూమిలో పెట్రోల్ పోసి నిప్పంటించి తగులబెట్టారు.  ఆ తర్వాత తన భర్త కనిపించటం లేదని మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఎన్ని కోణాలుగా విచారించిన ఆనంద్ ఆచూకీ లభించలేదు. చివరకు భార్యపైనే అనుమానంతో సీసీటీవీ ఫుటేజి, ఆమె కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారించగా మహేశ్వరి అసలు బాగోతం బయటపడింది. మహేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. క్షణికానందం కోసం నిండు జీవితాలు ఆగం చేసుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.