Home Crime షాపింగ్ మాల్ లో కొట్టుకున్న భార్యాభర్తలు..! భర్తను వేరే మహిళతో చూసి..

షాపింగ్ మాల్ లో కొట్టుకున్న భార్యాభర్తలు..! భర్తను వేరే మహిళతో చూసి..

షాపింగ్ కు వెళ్దామని భర్త భార్యతో అంటే సంతోషిస్తుంది.. ఆనందంగా వెళ్తుంది. అదే.. భర్త వేరే మహిళతో షాపింగ్ కు వెళ్తే భార్యకు నచ్చుతుందా.. గొడవ గొడవ చేస్తుంది. ఇంట్లో గొడవ చేస్తుంది.. నలుగురిలో చెప్పుకుంటుంది. అదే.. వేరే మహిళతో షాపింగ్ లో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే.. అక్కడికక్కడే తాట తీస్తుంది.. నానా యాగీ చేస్తుంది. సరిగ్గా ఇదే జరిగింది.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో. భర్త తనను కాదని వేరు మహిళతో షాపింగ్ కు వెళ్లాడని తెలుసుకుంది. అక్కడికే వెళ్లి అతడిని నిలదీసింది. దీంతో పెద్ద గొడవ జరిగింది. పోలీసులు ఎంటరై వీరిద్దరినీ స్టేషన్ కు తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..

74302644 | Telugu Rajyam

అయేషా – అద్నాన్ 2020 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య కలతలు వచ్చాయి. అయేషాను విడాకులు ఇవ్వాలని నోటీసులు ఇచ్చాడు అద్నాన్. అయితే.. ఇందుకు అయేషా అంగీకరించ లేదు. వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో కూడా ఉంది. అయితే.. అయేషా విడాకులు ఇవ్వకపోయినా అద్నాన్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ యువతితో షాపింగ్ కు వెళ్లాడు. విషయం తెలుసుకున్న అయేషా అక్కడికే వెళ్లింది. అయేషా రావడం చూసి ఓ షాప్ లో దాక్కున్నాడు అద్నాన్. బయటకు రావాలని పెద్ద గొడవ చేసింది అయేషా. బయటకు వచ్చిన అద్నాన్ ను జుట్టు పట్టుకుని కొట్టింది. దీంతో అద్నాన్ కూడా అయేషాను కొట్టాడు.

పెద్ద రచ్చ జరగడంతో పోలీసులు వచ్చి వీరిద్దరినీ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయేషాకు విడాకులు ఇచ్చానని అద్నాన్ అంటే.. నేనింకా సంతకం పెట్టలేదని అయేషా అంటోంది. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తున్నాడని.. వేరే యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని అయేషా అంటోంది. వచ్చిన యువతి తన స్నేహితురాలని అద్నాన్ అంటున్నాడు. విడాకులు తాను ఇవ్వలేదు కాబట్టి ఇంకా అద్నాన్ భార్యనే అంటోంది అయేషా. దీంతో వీరిద్దరినీ శాంతపరచి కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిద్దరి మధ్య విడాకుల ప్రక్రియ నడుస్తోందని.. విచారణ జరుపుతామని అంటున్నారు.

Related Posts

జస్టిస్ ఫర్ చైత్ర.. ఆ తర్వాతేంటి.?

ఓ నిర్భయ.. ఓ దిశ.. అంతకు ముందు, ఆ తర్వాత.. చాలానే జరిగాయ్.. జరుగుతూనే వున్నాయ్. ఎంతోమంది మహిళలు, మృగాళ్ళ అఘాయిత్యాలకు బలైపోతున్నారు. నెలల చిన్నారి.. కాటికి కాలు చాపిన వృద్ధురాలు.. ఎవరూ...

China Spy: భారత్ లో చైనా గూఢచారి..! విచారణలో కలకలం రేపే అంశాలు..

China Spy: ఈనెల రెండో వారంలో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం మాల్దా వద్ద ‘హాన్ జున్వే’ అనే చైనా గూఢచారి అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అతను వెల్లడిస్తున్న విషయాలు కలకలం...

Cyber Crime: భారీ సైబర్ క్రైమ్..! 2.50కోట్లు దోచేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్..!

Cyber Crime: సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయం ఎంత ప్రమాదమో తెలిపే సంఘటన రాజస్థాన్ లో జరిగింది. చాటింగ్ తో పరిచయమై.. నమ్మకం పెంచి.. స్నేహితురాలినని నమ్మించి.. ఏకంగా 2.50 కోట్లు దోచేసింది....

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News