బెజవాడలో మందు విందు పొందు పార్టీలు… హోటల్ పై పోలీసుల దాడి

విజయవాడ ఆంధ్రకి టెంపొరరీ క్యాపిటల్. క్యాపిటల్ లో సాధారణంగా క్రెయిమ్స్ ఎక్కువే. అయితే,విజయవాడ క్రైం కల్చర్ ఒక వింత. విజయవాడని ఆ మధ్య  కాల్ మనీ కుదిపేసింది.రూలింగ్ తెలుగుదేశం దిమ్మ తిరిగింది. ఎందుకంటే కాలమనీ రాకెటీర్లలో రూలింగ్ పార్టీ సరుకే ఎక్కువగా కనిపించింది. తర్వాత పేకాట క్లబ్బులు అట్టుడికించాయి. అందులో కూడా రూలింగ్ పార్టీ నేతల పేర్లు వినిపించాయి.

అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంటుండటంతో ఈ గొడవల్నీ రెండు మూడు రోజులు పత్రికల్లో, టివిలో బుస్సున పొంగి ఆ తర్వాత చల్ల బడ్డాయి.

ఇపుడొక కొత్త మాట విజయవాడ అందించింది. అదే ముజ్రాపార్టీ. విజయవాడ బయట అంతగా పరిచయం లేని మాట ఇది. ఇదొక మందు పార్టీ, కాకపోతే, విందు చిందు పొందు కూడా ఉండే పార్టీ .  వేలు వేలు వసూలు చేసి హోటళ్ల వాళ్లు మందు విందు పొందు అందించి అనందింపచేసే పార్టీ. ఇది విజయవాడలో గట్టుచప్పుడుకాకుండా నడుస్తూ ఉండింది. బుధవారం రాత్రి  పోలీసుల ఆలివ్ ట్రీ అనే హోటల్ మీద దాడిచేసి, పార్టీ సరంజామాను పట్టేశారు. ఈ పార్టీలో మందు విందుతో పాటు పొందుకోసం అమ్మాయిలతో అసభ్య నృత్యాలు చేయించి ఆనందంపంచుతున్నారు. పోలీసుల దాడిలో కొంతమంది అధికారి పార్టీ వోళ్లు, మందుబాబు, మందుబాటిళ్లు, కండోమ్స్ కూడా దొరికాయి.

విజయవాడ భవానీపురంలో ఉన్న ఈ హోటల్ ఒక టిడిపినేతదని చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యేయే బినామీ పేరుతోె ఈ హోటల్ నడిపిస్తూ ముజ్రా పార్టీ ల పేరుతో బాాగా వసూలు చేస్తున్నాడని సమాచారం. అందుకే, పోలీసులు హోటల్ యాజమాన్యం వివరాలు అందించలేదని అంటున్నారు. ఈ దాడి గురించి విజయవాడ పోలీస్ జాయింట్ కమిషనర్ రానా ఏమన్నారో చూడండి…

‘‘బెజవాడలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసు నమోదయింది. ముజ్రా పార్టీకి సంబంధించి 53 మందిని అరెస్ట్ చేసాం.హోటల్ నిర్వాహకుల మీద కేసు పెట్టాం.ఒక్కో వ్యక్తి నుంచి 5 నుంచి 10 వేలు చొప్పున 5 లక్షలు వసూల్ చేసిన నిర్వాహకులు అమ్మాయిలతో నృత్యాలు చేయించి ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. ఈ ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టాం.ఇకపై కూడా ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు ఉంటాయి.’’