అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను అడ్డుకొని తుపాకులతో కాల్చి మావోలు దారుణంగా హత్య చేశారు. ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్టు నిర్దారణ అయింది. మావోలు హత్యకు పాల్పడే ముందు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ దృశ్యాలు ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. లింక్ పై క్లిక్ చేస్తే వీడియో వస్తుంది.
అరకు ప్రాంతంలో మావోలు పెద్దఎత్తున సంచరిస్తుండటంతో, రంగంలోకి దిగిన పోలీసు బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల పోలీసులు కూడా కూంబింగ్ లో పాలుపంచుకుంటూ ఉండటంతో విశాఖ మన్యం యుద్ధక్షేత్రాన్ని తలపిస్తోంది.