ప్రియరాలి చేత గర్భవతైనా భార్యను చంపించిన భర్త

వివాహేతర సంబంధం ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. పంజాబ్ కు చెందిన రవ్నీత్ కౌర్, జన్ ప్రీత్ దంపతులు. వీరు ఆస్ట్రేలియాలో ఉండేవారు. రవ్నీత్ ప్రస్తుతం గర్భిణి కావడంతో మార్చి 14న ఫిరోజ్ పూర్ జిల్లాలోని తమ స్వంత గ్రామానికి వచ్చింది. వివాహానికి ముందే జన్ ప్రీత్ కు ఆస్ట్రేలియాలో కిరణ్ జీత్ కౌర్ అనే వివాహిత మహిళతో సంబంధం ఉంది. వీరి సంబంధానికి అడ్డుపడుతున్న రవ్నీత్ ను చంపాలని ప్లాన్ వేశారు. కిరణ్ జీత్ ను ప్లాన్ ప్రకారం రవ్నీత్ వద్దకు పంపాడు.

రవ్నీత్ కు జన్ ప్రీత్ వీడియో కాల్ చేసి బయటికి రమ్మన్నాడు. అక్కడ కిరణ్ జీత్ రవ్నీత్ ను కిడ్నాప్ చేసి చంపేసింది. ఆ తర్వాత కాలువలో పడేసింది. రవ్నీత్ సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన  పోలీసులకు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.  కిరణ్ జిత్ కౌర్ ది కూడా పంజాబ్ గానే గుర్తించారు.

కిరణ్ జిత్ హత్య చేసి అనంతరం ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కిరణ్ జీత్ మరియు జన్ ప్రీత్ ను గుజరాత్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.