ఆ దేశంలో మరోసారి తుపాకులు పేలాయి. ముగ్గురిని బలి తీసుకున్నాయి. పలువురిని తీవ్రంగా గాయపరిచాయి. ఎక్కడో కాదు అగ్రదేశం అమెరికాలో. లాస్ ఏంజిలిస్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంత నగరం టొర్రాన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:20 నిమిషాలకు గ్యాబల్ హౌస్ బౌల్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఈ కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు సంఘటనాస్థలంలోనే మరణించారు. మరో అయిదుమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే టొర్రన్స్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కాల్పులకు తెగబడ్డ ఆగంతకుడిని అరెస్ట్ చేశారా? లేదా? అనేది తెలియరాలేదు.