Daaku Maharaj: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆహా.. బాలయ్య బాబును కలిసి అవకాశం.. ఎలా అంటే?

Daaku Maharaj: నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాకా బాలయ్య బాబు గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపుతో మరో సినిమాలో నటించారు బాలయ్య బాబు. ఆ సినిమా డాకు మహారాజ్. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని అభిమానులు అలాగే మూవీ మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక జనవరి 4వ తేదీన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏకంగా అమెరికాలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్. అమెరికాలోని టెక్సాస్‌ లో జ‌న‌వ‌రి 4 శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కోసం బాల‌య్య అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ ఈవెంట్‌ కు వెళ్లే ఫ్యాన్స్ కోసం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా అదిరిపోయే ఆఫ‌ర్ తీసుకువ‌చ్చింది. డిసెంబ‌ర్ 31లోగా ఆహా గోల్డ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ప్రీరిలీజ్ ఈవెంట్‌ ను లాంచ్‌ లో కూర్చోని చూడవచ్చట. అంతేకాదండోయ్ బాల‌కృష్ణ‌ను క‌లిసే అవ‌కాశాన్ని కూడా సైతం పొంద‌వ‌చ్చట. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెంటనే ఆహా గోల్డ్‌ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని, బాలయ్య బాబును కలిసేయండి. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్,శ్రద్ధా శ్రీనాథ్ లు హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు బాబీ డియల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడులైన పోస్ట‌ర్లు, గ్లింప్స్‌, రెండు పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేశాయి.