ఆ విద్యార్దిని జెండా వందనం సంధర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో ఆనందంగా పాల్గొని ఫస్టు ప్రైజ్ గెలుచుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా ఇచ్చే బహుమతిని తీసుకునేందుకు ఆ అమ్మాయి స్టేజి మీదకు వెళ్లింది. కానీ బహుమతి అందుకుంటూనే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. ఈ విషాద సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.
సోలిపేట గ్రామానికి చెందని భవ్య ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. భవ్య గత కొంత కాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నట్టుగా తోటి ప్రెండ్స్ ద్వారా తెలుస్తోంది. బహుమతి తీసుకుంటున్న భవ్య మూర్చతో కిందపడి పోయింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు లేపే ప్రయత్నం చేసినా భవ్య ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది. హాస్పిటల్ కు తరలిద్దామనుకున్నా భవ్య చనిపోయినట్ట నిర్ధారించుకొని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. భవ్య మృతితో పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీరు పెట్టారు. భవ్య తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.