రామంతాపూర్‌లో ఘోర విద్యుత్ ప్రమాదం, స్తంభంపైనే కార్మికునికి మంటలు (వీడియో)

హైదరాబాద్ రామాంతాపూర్ లో ఘోర విద్యుత్ ప్రమాదం జరిగింది. రామాంతపూర్ లోని శ్రీనివాసపురంలో రిలయన్స్  కేబుల్  కార్మికుడు తీగలు సరిచేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో కార్మికునికి షాక్ వచ్చి శరీరానికి మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు కట్టెల సాయంతో అతనినిని కిందికి దింపారు. తీవ్రగాయాలైన కార్మికుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.  కార్మికుడు విద్యుత్ షాక్ కు గురైన వీడియో కింద ఉంది చూడండి.

ప్రమాద విషయాన్ని విద్యుత్ శాఖ గోప్యంగా ఉంచుతోందని, కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. వైర్లు జనాలకు తగిలేటట్టు ఏర్పాటు చేసి కనీస రక్షణ చర్యలు చేపట్టని అధికారులపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.