మంటల్లో కాలిన భార్యని ఆస్పత్రిలో చేర్పించిన భర్త… కట్ చేస్తే కటకటాల పాలైన భర్త!

శివరాత్రి రోజు దీపం పెడుతుండగా కొంగుకు నిప్పు అంటుంది భర్త భార్యని ఆసుపత్రిలో చేర్పించాడు కానీ మంటలలో ఖాళీ తీవ్రంగా గాయపడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే తల్లి మరణించిన తర్వాత కూతురు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అసలు విషయం చెప్పటంతో పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాలలోకి వెళితే..మేడ్చల్‌లోని సూర్యనగర్‌లో నివాసముండే తిరునగర్‌ నవ్యశ్రీ(33)కు 15 ఏండ్ల కిందట సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారంకు చెందిన నరేందర్‌(35)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శివరాత్రి రోజు నవ్యశ్రీ శరీరం కాలిపోతుండగా అరుస్తూ ఇంటినుంచి బయటకు వచ్చింది. ఆమెను గుర్తించిన ఇంటిపక్కన ఉండే వారు, ఆమె భర్త నీటితో మంటలను ఆర్పి వెంటనే ములుగులోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని అక్కడ నవ్య శ్రీ ని విచారించగా.. ఆమె వాగ్మూలం ఇస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ముగిసిన అనంతరం దేవుడి పటం వద్ద దీపం వెలిగించిన తర్వాత కింద పడవేసిన అగ్గిపుల్ల చీరకు తగిలి, ఒంటికి నిప్పంటుకుందని చెప్పింది. దీంతో పోలీసులు అదే ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా నవ్యశ్రీ చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది.

అయితే నవ్యశ్రీ మృతి చెందిన తర్వాత ఆమె పెద్ద కూతురు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, తన తల్లి ప్రమాదవశాత్తు చనిపోలేదని, తండ్రి నరేందర్ ఉద్దేశపూర్వకంగానే తన తల్లి మీద శానిటైజర్ కోసం నిప్పు పెట్టాడని ఆ సమయంలో తాను అడ్డుపడిన కూడా వినకుండా తల్లి మీద శానిటైజర్ పోసి నిప్పు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోలీసులు నిందితుడు నరేందర్‌పై 302, 201, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.