వినాయకుడిని తెస్తుండగ ఘోర రోడ్డు ప్రమాదం.. విషమ పరిస్థితిలో ముగ్గురు యువకులు!

దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాల్లో కోల్పోతున్నారు. దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అందువల్ల ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతుంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా రోడ్డు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల అభం శుభం తెలియని చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు నడిపేవారి అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మేడ్చల్ జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్ర గాయాల పాలై విషమ పరిస్థితిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

వివరాలలోకి వెళితే… వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావడానికి కామారెడ్డి పట్టణంలోని బీడి కాలనీలోని ఓం యూత్ క్లబ్‌కు చెందిన 14 మంది యువకులుహైదరాబాద్ కి వెళ్ళారు. వినాయకుడి విగ్రహాన్ని తీసుకోని తిరిగి వస్తుండగా మేడ్చల్ దగ్గర మీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. లారీ వేగంగా ఢీకొనటంతో మీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భరత్, రాజు, లక్ష్మణ్ అనే ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు అవ్వగా.. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో యువకుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడి విగ్రహాన్ని తీసుకురావటానికి వెళ్ళ ఇలా ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నారు. ఈ. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.