టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిపై నర్సీపట్నంలో పోలీస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. నర్సీపట్నం మహిళా కమీషనర్ కృష్ణవేణిని అభ్యంతరకర పదజాలంతో దూషించడంతో ఆమె కేసు పెట్టారు. పోలీసులు అయ్యన్నపై పలు సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదు చేసారు. దీంతో ఈ వివాదం రాష్ర్ట స్థాయిలో సంచలనంగా మారింది. అయ్యన్న తీరుపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. నేడు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. మహిళలపై అయ్యన్న మాటల దాడులేంటని మండిపడ్డారు.
కేసుకు సంబంధించి వివరాలను కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలసుకున్నారు. ఏ క్షణమైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా ఈ వివాదం పై టీడీపీ మహిళా విభాగం అద్యక్షురాలు వంగలపూడి అనిత అయ్యన్న పాత్రుడ్ని వెనకేసుకొచ్చారు. అయ్యన్న మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉంటారని..ఆయనకు కోపం అనే పదమే తెలియదన్నారు. అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ఏడాదిగా రాష్ర్టంలో 400 మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మహిళా కమీషన్ అప్పుడే చేస్తుందని ప్రశ్నించారు. మహిళా కమీషన్ ఇప్పుడే నిద్ర లేచిందా అని ఎద్దేవా చేసారు. దిశ చట్టానికి చట్టబద్దత తీసుకురాలేదని, చవటలు ఉన్నారంటూ అనిత సహనం కోల్పోయి మాట్లాడారు.
ఇక అనిత విషయానికి వస్తే గత ఎన్నికల్లో కొవ్వురు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. 2014లో పాయకరావు పేట నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ అభివృద్ది గుండు సున్నాగా స్థానిక ప్రజలు తేల్చడంతో అదిష్టానం 2019 ఎన్నికల్లో అభ్యర్ధిని మార్చేసింది. అంతకు ముందు నియోజక వర్గ ప్రజల్ని కాకా పట్టే ప్రయత్నం చేసారు. అదిష్టానం మెప్పుకోసం ప్రతీ గ్రామం తీరిగే కార్యక్రమం పెట్టారు. కానీ ఏ ఊరు గ్రామ ప్రజలు కూడా అనితను ఊళ్లో కాలు పెట్టడానికి వీల్లేదంటూ హెచ్చరించారు. సాహసం చేసి కొన్ని గ్రామాల్లో కాలు పెట్టే ప్రయత్నం చేస్తే చెప్పుల దాడులు చేసారు.