అతివేగం ప్రమాదకరం అని ఎంతగా ప్రచారం చేసినా వాహనదారులు జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిండు జీవితాలు అతి వేగానికి బలై పోతున్నాయి. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చి పోతున్నారు.
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండ మడుగు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ వద్ద రోడ్డు దాటుతున్న యువకులను స్కార్పియో వాహనం ఢీకొట్టగా గాలిలో ఎగిరి కింద పడ్డారు. ఓ యువకుడు కింద పడి అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆరోరా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పరీక్ష రాయడానికి బైకుపై ముగ్గురు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్దుల ప్రమాదానికి గురైన వాహనం ప్రభుత్వానికి చెందినది. దీంతో కాలేజితో పాటు విద్యార్ధుల గ్రామాలలో విషాద చాయలు అలుముకున్నాయి. చనిపోయిన విద్యార్ధి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ప్రభుత్వాసుపత్రి ముందు విద్యార్ధులు, కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నారని జాగ్రత్తగా నడిపాలని పలువురు కోరుతున్నారు. విద్యార్ధులకు జరిగిన రోడ్డు ప్రమాద వీడియోలు కింద ఉన్నాయి చూడండి.
న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న మృతి చెందిన విద్యార్ధి బంధువులు