హైదరాబాద్ లక్డీకపూల్ లోని గ్లోబల్ హస్పిటల్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శబినా బేగం అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. శబీనా బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. శబీనా మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హస్పిటల్ పై దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని వదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి పై దాడి వీడియో కింద ఉంది చూడండి.