మోడీ దుమ్ము దులిపిన టీడీపీ ఎంపీ శివ ప్రసాద్

చిత్తూర్ ఎంపీ శివప్రసాద్ పార్లమెంటు సమావేశాలలో ప్రతిరోజూ విభిన్నంగా నిరసన తెలుపుతున్నారు. స్వతహాగా నటుడు అయిన శివ ప్రసాద్ రోజుకో వేషం వేస్తూ మోడీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఆయన సర్ ఆర్థర్ కాటన్ దొర వేషం వేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రా కోసం టీడీపీ డిమాండ్స్ అమలు చేయాలని గెటప్ కి తగ్గట్టు తనదైన శైలిలో మోడీని హెచ్చరించారు. బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ దొరగారు ధవళేశ్వరం బ్రిడ్జి కట్టించినందుకు ఆయన ఫోటోలని మన ఇంట్లో పెట్టుకుని దేవుడిలా పూజిస్తున్నాం. మన కుటుంబంలో వ్యక్తిగా భావించి గోదావరి పుష్కరాల సమయంలో ఆయనకు పిండ ప్రదానం చేస్తున్నాం. అటువంటిది మోడీకి దేశ ప్రధానమంత్రిగా అవకాశమొచ్చింది. ఆ పదవిని ఆయన సద్వినియోగం చేసుకోవాలన్నారు శివ ప్రసాద్.

పోలవరంపై ఆంక్షలు అనుమానాలు మాని నిధులు పంపిణీ చేసి సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడమని కోరారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటుందని సూచించారు. మాట ఇచ్చి తప్పుకోవటం మీ లక్ష్యమా మోడీ అంటూ మోడీని ప్రశ్నించారు. వెటకారం మీ స్వభావమా..? అహంకారం మీ అలంకారమా..? నిరంకుశం మీ స్వరూపమా..? “ఇదే పార్లమెంటుకి ఎంతోమంది ప్రధాన మంత్రులు వస్తారు…వెళ్ళిపోతారు. మీరు కూడా శాశ్వతం కాదు మీరు కూడా వెళ్ళిపోతారు”. కానీ మనిషిగా వెళ్ళండి, మంచిగా వెళ్ళండి, మానవత్వంతో వెళ్ళండి” అంటూ మోడీని హెచ్చరించారు. కానీ నాది రాతి గుండె, నేను ప్రజల్ని హింసిస్తాను, నాకు ఎలాంటి స్పందన లేదంటే అది మీ ఖర్మ, మీ సంగతి ప్రజలే చూసుకుంటారు అని మోడీ దుమ్ము దులిపేశారు. మంచి పనులు చేస్తే కాటన్ దొరలా చరిత్రలో నిలిచిపోతారని, పరాయి దేశస్థులే దేశం కోసం కృషి చేస్తే దేశ ప్రధానిగా ఉన్న మీరు ఆంధ్రా ప్రజల కోసం ఈమాత్రం చేయలేరా అని మోడీని గట్టిగా ప్రశ్నించారు ఎంపీ శివ ప్రసాద్.