హైదరాబాద్ భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్ (వీడియో)

స్విగ్గి యాజమాన్యం తమకు వేతనాలు  ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తుందని హైదరాబాద్ లో స్విగ్గి ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్డర్లు తీసుకోకుండా స్విగ్గి సేవలు నిలిపేసి వారు ఉద్యమ బాట పట్టారు. బిర్యానీలు, ,ఇతర ఫుడ్ పదార్ధాలను స్విగ్గి లో ఆర్డర్ ఇస్తే స్విగ్గి బాయ్స్ వారికి ఇంటికి తెచ్చి ఇస్తారు. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని హోటల్స్ కు అనుసంధానమై ఈ స్విగ్గి బాయ్స్ పనిచేస్తారు. స్విగ్గి ఉద్యోగులకు వారానికి మినిమం రూ. 7000 జీతం అందిస్తామని యాజమాన్యం ఉద్యోగంలోకి తీసుకుంది. ఆ తర్వాత దానిని మినిమం  5000 రూపాయలకు తగ్గించారు. ఆ తర్వాత ఇప్పుడు 2100 రూపాయలకు తగ్గించారు.

వేతనాలలో కోత పెట్టడంతో తమ బతుకులు ఎలా సాగాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలు డబ్బులు, కనీస వేతనం అందక తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. యాజమాన్యం ఉద్యోగంలోకి తీసుకునే ముందు ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు తీసుకుందని రిక్రూట్ మెంట్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తమకు జీతాలు చెల్లించటం లేదని వారు వాపోయారు. స్విగ్గిని నమ్ముకొని వేలాది మందిమి బ్రతుకుతున్నామని ఇప్పుడు మా బతుకుల మీద దెబ్బకొడితే తామేలా బతకాలని వారు స్విగ్గి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇవ్వాల్సిన వేతనాలు కూడా సమయానికి చెల్లించక ఇబ్బందులు పెడుతున్నారని వారు అన్నారు.

స్విగ్గి యాజమాన్యం న్యాయ పరంగా తమకు ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనను తీవ్ర ఉద్రిక్తం చేస్తామని వారు హెచ్చరించారు. ఎంతో మందిమి దీనిని నమ్ముకొని బతుకుతుంటే మా పొట్ట కొట్టాలని చూడటం స్విగ్గి  యాజమాన్యానికి తగదని వారన్నారు. స్విగ్గి యాజమాన్యం వెంటనే సమస్యలు పరిష్కారం చేసి న్యాయం చేయాలని స్విగ్గి ఉద్యోగులు డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న స్విగ్గి ఉద్యోగులు