మారుతీరావు జీవిత చరిత్ర తెలిస్తే షాక్ కావాల్సిందే…

తిరునగరి మారుతీరావు… తన కుమార్తెను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ని అత్యంత పాశవికంగా హత్య చేయించిన వ్యక్తి. మిర్యాలగూడ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బిల్డర్ గా పేరున్న మారుతీరావు జీవితమంతా అక్రమాలమయమే. ఓ సాధారణ కిరోసిన్ డీలర్ గా 30 ఏళ్ల కింద కోదాడ ప్రాంతం నుంచి మిర్యాలగూడకు వలస వచ్చారు. పట్టణ రాజకీయాలను, అధికార యంత్రాగాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. పూట గడవడమే కష్టంగా జీవితాన్ని ప్రారంభించాడు. 100 కోట్లకు పైగా ఆస్తులను పోగేశాడు.

కూతురితో మారుతీరావు

మారుతీరావు బంధువు కాంగ్రెస్ పార్టీలో లీడర్ గా ఉండటంతో తొలినాళ్లలో పెళ్లాం మొగుళ్ళ పంచాయతీలు చెప్పేవాడు. ఆ తరువాత పైరవీలు, దందాలను రెట్టింపు చేశాడు.గతంలో తహసీల్దార్ గా పని చేసిన ఓ వ్యక్తికి సన్నిహితుడయ్యాడు. ఆయన బలహీనతను ఆసరాగా చేసుకొని మహిళలను ఎరగా వేసి చివరకు ఆయన కుటుంబాన్ని వంచించాడు. ఆ ఎమ్మార్వో తాను చెప్తే వినేటట్టు చేసుకొని ప్రభుత్వ భూములను దళితుల మీదకు మార్చేవాడు. ఆ తరువాత వాటికి చట్టబద్దత వచ్చేలా చేసి వాటిని మరొకరికి అమ్మి డబ్బులు తీసుకునేవాడు. మధ్యలో ఉన్న దళితులకు పావులో పరకో ఇచ్చేవాడు. ఎక్కడ వివాదాస్పద భూములున్నా అధికారుల అండదండతో వాటిని పరిష్కరించి భారీగా పైసలు తీసుకునేవాడు.

అమృత ప్రణయ్ ల పెళ్లినాటి ఫోటో

ఆర్డీవో, డీఎస్పీ, సీఐ , ఎమ్మార్వో, అధికారులకు చేరువై వారి బలహీనతలను తీరుస్తూ వందలాది మంది మహిళలతో మారుతీరావు ఆటలాడుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఆ తరువాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సంబంధాలు ఏర్పరుచుకొని చక్రం తిప్పేవాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో పనులు చేయించుకునే సత్తా మారుతీరావుకు ఉందని పలువురు చెబుతున్నారు.

గతంలో ఓ సీనియర్ మంత్రితో మారుతీరావు సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడని, మంత్రి వియ్యంకుడితో కలిసి మిర్యాలగూడలో బిల్డర్ అవతారమెత్తాడని తెలుస్తోంది. 2000 సంవత్సరానికి ముందు వివిద రూపాల్లో సంపాదించిన మారుతీరావు శరణ్య గ్రీన్ హోమ్ పేరుతో పూర్తిగా నిర్మాణ రంగంలోకి వచ్చాడు.

ఐదేళ్ల కింద నయీం గ్యాంగ్ మిర్యాలగూడలో 5 ఫ్లాట్లను కబ్జా చేసింది. అందులో మారుతీరావు ప్లాట్ కూడా ఉంది. మారుతీరావు నయీం మనుషులను బెదిరించడంతో వారు కిడ్నాప్ చేశారు. పట్టణంలో విలువైన స్థలాన్ని వారికి వదిలేసి వారితో మారుతీరావు సత్సంబంధాలు కొనసాగించాడు. ఎవరైనా వినకపోతే నయీం గ్యాంగ్ తో బెదిరించి ఫోన్ చేయించేవాడు. మారుతీరావు జీవితమంతా నేరాలమయమే అని పలువురు తెలిపారు.