జయరాం హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. జయరాం మేన కోడలు శిఖా చౌదరి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించింది. శిఖా చౌదరి విచారణలో పోలీసులకు ఏం చెప్పిందంటే…
“మామయ్య వ్యక్తిగతంగా మంచివాడు కాదు. నాకు ఇది వరకే రెండు పెళ్లిలు అయ్యాయి. ఈ సమయంలో నాకు రాకేష్ రెడ్డితో పరిచయం అయ్యింది. రెండో భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత రాకేష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. రాకేష్ రెడ్డితో డేటింగ్ చేశాను. రెండో భర్తతో విడిపోవడానికి కారణం రాకేష్ రెడ్డి. కానీ అదే సమయంలో మామయ్య నాతో సన్నిహితంగా ఉండడం మొదలు పెట్టాడు.
ఆర్థికంగా సహాయ పడ్డాడు. తనతో పాటు తన చెల్లి పై లైంగికంగా వేధించేవాడు. నా వ్యక్తిగత జీవితం కావడంతో నేను మామయ్యతో కలిశాను. నా చెల్లి మనీషాకు మెడిసిన్ సీటు మామయ్య ఇప్పించాడు. నా చెల్లి పై కూడా మామయ్య వేధించాడు. దాంతో అతనికి అవుపడకుండా చెల్లెలు ఉండేది. చెల్లెలు ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.
అమెరికా నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి వెళ్లేవాడు. జయరాం మామయ్యకు రాకేష ను నేనే పరిచయం చేశాను. రాకేష్ కు ప్రత్యేక వ్యాపారాలు లేవు. మామయ్యకు రాకేష్ 4.5 కోట్ల రూపాయల అప్పు ఇచ్చాడు. వాటిని ఇవ్వడంలో మామయ్య నిర్లక్ష్యం చేశాడు. చెక్ పవర్ అత్త చేతిలో ఉండడంతో మామయ్య బయట అప్పులు చేశాడు. అదే సమయంలో నాకు శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది. శ్రీకాంత్ కు నాలుగు వైన్స్ లు ఉన్నాయి. వ్యాపారాలు కూడా ఉన్నాయి. శ్రీకాంత్ తో నాలుగు నెలలుగా డేటింగ్ లో ఉన్నాను.
మామయ్య చనిపోయిన రోజు నేను శ్రీకాంత్ తో కలిసి వికారాబాద్ కు లాంగ్ డ్రైవ్ కి వెళ్లాను. అదే సమయంలో ఉదయం అమ్మ ఫోన్ చేసి మామయ్య చనిపోయాడని చెప్పింది. దీంతో నేను వెంటనే మామయ్య ఇంటికి వెళ్లి జగ్గయ్యపేటలో నాకు రాసిచ్చిన 10 ఎకరాల పొలంకు సంబంధించిన పత్రాల కోసం వెతికాను. ఆ తర్వాత మామయ్యను చూడడానికి విజయవాడకు వెళ్లాను. అక్కడ పోలీసులు రమ్మంటే విచారణకు వచ్చాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను.
నాకు మామయ్య హత్యకు ఎటువంటి సంబంధం లేదు. మామయ్యను రాకేషే హత్య చేశాడని అనుమానంగా ఉంది. రాకేష్ హత్య చేసేంత కోపంగా ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను. మామయ్య మాత్రం మంచివాడు కాదు.” అని శిఖా చౌదరి పోలీసుల విచారణలో పేర్కొంది. ఇప్పటికే రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.