ఆంధ్రా లేడీ రిపోర్టర్ పై లైంగిక వేధింపులు  (వీడియో)

పాత గుంటూరులో దారుణం జరిగింది.  టీవీ 4 మహిళా రిపోర్టర్ పై కొంత మంది రౌడీగాళ్లు దాడి చేశారు. ఉమా దేవి టివి 4 మహిళా రిపోర్టర్ గా పని చేస్తుంది. అయితే ఆమె విధి నిర్వహణలో భాగంగా కొంత మంది చేస్తున్న అక్రమాలను బయటపెట్టింది. దీంతో ఆ ముఠాగాళ్లు బెదిరింపులకు పాల్పడడంతో ఉమా దేవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు గురించి తెలుసుకున్న ఆ రౌడీగాళ్లు అర్ధరాత్రి ఉమాదేవి ఇంటికెళ్లి ఆమె భర్త ఆటోను ద్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఇక్కడే రేప్ చేస్తాం ఎవరొచ్చి కాపాడుతారని బెదిరించారట. అర్ధరాత్రి ఆడదానికి నరకం చూపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఇంట్లోలేని సమయంలో వచ్చి అకారణంగా దాడి చేశారని ఆమె విలపించింది. తన మెడపై కత్తితో దాడి చేశారని చంపేస్తామని బెదిరించారని ఉమాదేవి తెలిపింది. దీనిని జర్నలిస్ట సంఘాలు అన్ని కూడా ఖండించాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉమాదేవి సోషల్ మీడియాలో తన బాధను చెపుతూ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియో కింద ఉంది చూడండి.

దుండగుల దాడిలో ధ్వంసమైన ఉమాదేవి భర్త  ఆటో