సికింద్రాబాద్ లో సెట్విన్ బస్సు బీభత్సం

సికింద్రాబాద్ లో సోమవారం ఉదయం సెట్వీన్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన బస్సు ఆగి ఉన్న ఆటోను ఢికొట్టి పక్కనే ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

సికింద్రాబాద్ రేతిఫైలి బస్టాండ్ దగ్గర ఓ ఆటో ఆగి ఉంది. అదే సమయంలో వెనుకంగా వేగంగా సెట్వీన్ బస్సు దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోను ఢీకొట్టి ఓ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడ పెద్దగా జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.