చందమామతో సెల్ఫీలు దిగమంటున్నారు

దేశవ్యాప్తంగా ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది.గ్రహణం పడినప్పుడు అది చేయవద్దు ఇది చేయవద్దు అంటూ మూఢనమ్మకాలు ఉన్నాయని అవి అన్ని ఉత్తయే అని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. శుక్రవారం రాత్రి 11.45 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అది దాదాపు 43 నిమిషాల పాటు ఉండి సంపూర్ణ అరుణచంద్రగ్రహణంగా ఇది చరిత్ర సృష్టించనుంది. దీనికి తోడు ఇదే రోజు అరుణ గ్రహం భూమికి చేరువగా రానుంది. ఈ గ్రహణ సమయంలో ఏదైనా తింటూ ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు దిగి ఫేసుబుక్ , వాట్సాప్, ట్వీట్టర్ లలో పోస్టులు చేయాలని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. తద్వారా ప్రజలలో ఉన్న మూడనమ్మకాలను పోగొట్టొచ్చంటున్నారు. సంపూర్ణ చంద్రగ్రహానాన్ని ఆస్వాదించి మూడనమ్మకాలను పారద్రోలుదామని పలు స్వచ్చంధ సంస్థలు పిలుపునిచ్చాయి.