ముంబయిలో ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని స్థానికులు కాపాడారు. నవీ ముంబైలోని తలోజ ప్రాంతంలో బ్రిడ్జి దాటుతుండగా నీటి ప్రవాహానికి కారు వరదల్లో కొట్టుకుపోయి సగం దూరానికి వెళ్లి ఆగింది. దీంతో కారులో ఉన్న వారంతా కారు పైకి ఎక్కి సహాయం కోసం అరిచారు. గమనించిన స్థానికులు వారిని తాడుతో చాకచాక్యంగా కాపాడి వారి ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అశ్రఫ్ ఖలీల్ షేక్, అతని భార్య హమిదతో పాటుగా ఇద్దరు పిల్లలతో పాటుగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో కారు అదుపుతప్పి నది కాలువలో పడిపోయింది. అక్కడ బండరాళ్లు ఉండటంతో కారు సగం దూరం పోయి ఆగిపోయింది. దీంతో స్థానికులు వారిని కాపాడటం ఈజీ అయ్యింది. వారిని కాపాడటంలో తెగువ చూపించిన గంగారం, లహు, లక్ష్మణ్ లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. వారు కాపాడిన తీరు వీడియో కింద ఉంది మీరు కూడా చూడండి.