హైదరాబాద్‌లో దారుణం, పరువు హత్యకు బలైన గర్భిణి(వీడియో)

హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్టు పరిధిలో దారుణం జరిగింది. స్థానికంగా నివాసముంటున్ననర్సింహ్మ తన కూతురిని గొంతుకోసి హత్య చేశాడు. నాలుగేళ్ల క్రితం వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని విజయ అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారికి  ఓ బాబు ఉన్నాడు ప్రస్తుతం విజయ గర్బవతి. ఇటీవల విజయ అత్త చనిపోవడంతో గ్రామానికి భర్త సురేష్ తో కలిసి వచ్చింది. విజయ హత్యకు గురైన వీడియో కింద ఉంది.

స్థానికంగా ఉన్న కమ్యూనిటి హాల్ లో వారు ఉంటున్నారు. గురువారం ఉదయం తన పిల్లవాని కోసం విజయ బయటికి రాగా విజయలక్ష్మీని చూసిన తల్లిదండ్రులు, వారి బాబాయిలు విజయను కొట్టుకుంటూ లోపలికి తీసుకెళ్లి గొంతు నులిమి చేతులు కోసి హత్య చేశారు. ఈ హత్యకు ముందుగానే పథకం పన్ని తన భార్యను హత్య చేశారని మృతురాలి భర్త సురేష్  8 మంది పేర్లతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య చేసిన అనంతరం మృతురాలి తండ్రి నర్సింహ్మ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయ మృతదేహం