హైదరాబాద్ లోని బోయిన్ పల్లి పోలీసులు రెచ్చిపోయారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న యువకులను స్టేషన్ కు పట్టుకొచ్చి చికతబాదారు. తోడ్కలు ఊడిపోయేలా ఆ యువకులను కొట్టారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ యువకుల పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తి వివరాలు (ఫొటోలు, వీడియోలు) ఇవీ.
హైదరాబాద్ లోని బోయిన్ పల్లి సెవన్ టెంపుల్స్ వద్ద సాయి ముదిరాజ్ అలియాస్ దగడ్ సాయి బర్త్ డే వేడుకలు మంగళవారం సాయంత్రం జరిగాయి. అయితే ఈ వేడుకల్లో హైదరాబాద్ లోని చాలా బస్తీల్లోంచి యూత్ పాల్గొన్నారు. దగడ్ సాయి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సమయంలో పోలీసులకు ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి (అధికార టిఆర్ఎస్ పార్టీ నేత) ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే వారమంతా బ్యాంకులు పనిచేయవ్ …ఎందుకో తెలుసా… చదవండి
దీంతో బర్త్ డే పేరుతో న్యూసెన్స్ చేస్తారా అని 9 మంది యువకులను బోయిన్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు లాకప్ లోనే ఉంచుకుని కసితీరా కొట్టారు. వారి శరీర భాగాలన్నీ కమిలిపోయేలా వాతలు వచ్చేలా కొట్టారు. బాధితులంతా విద్యార్థులు. మైనర్ లు గా తెలుస్తోంది.
అయితే బర్త్ డే జరుపుకున్న దగడ్ సాయి అలియాస్ సాయి ముదిరాజ్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. గతంలో సిరిసిల్లలో పోలీసులు కొందరు దళితులపై ఇదే తరహాలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడు హైదరాబాద్ లో యూత్ ను చితకబాదారు.
అయితే బర్త్ డే పార్టీ రోజు వారిని విచారించి వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై నార్త్ జోన్ డిసిపి సమగ్ర విచారణ జరుపుతున్నారు. బోయిన్ పల్లి ఇన్సెక్టర్ ఆనంద్ కిషోర్, ఎస్సైలు గురు స్వామి, శ్రీనివాస్ తమను చితకబాదినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు. బర్త్ డే జరిగిన రోజున పరిసరాల్లో ఉన్న సిసి కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వీరు ఏమైనా న్యూసెన్స్ చేశారా నఅ్న కోణంలో విచారణ జరుగుుతన్నది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధిత యువకులను పోలీసులు ఎలా కొట్టారో ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తుంది.