స్థానిక ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోవడానికి బిజినెస్లో ఉన్నవాళ్లు ఎగబడుతుంటారు. ఎందుకంటే, రేప్పొద్దున అక్రమాలు చేస్తూ దొరికిపోతే ఆదుకుంటాడని, అండగా ఉంటాడని ఆశ. ఇలా ఎగడబడటం ఒక స్కూల్ చేస్తే… అందున ఒక గొప్ప నేత పేరు పెట్టుకున్న స్కూల్ చేస్తే…
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన హైదరాబాద్ లోని ఓ పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునేందుు ఘోరమయిన తప్పు చేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక ఫ్లెక్స్ బోర్డు తో లోకల్ ఎమ్మెల్యేను ఒక మహానుభావుని చేద్దామనుకుంది ఒక స్కూల్. అంతే, స్వాతంత్య్ర దినోత్సవానికి దానికి ఉపయోగించుకుంది. జాతీయ పతాకాన్ని అవమానించేందుకు కూడా వెనకాడలేదు. జాతీయ పతాకం మీద ఎమ్మెల్యే నిలబడి ఉన్న ఫొటో ముద్రించిన నిలువెత్తు ఫ్లెక్స్ బోర్డును స్కూల్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసింది. ఇది బాధ్యతా రాహిత్యమో చెప్పాల్సిన పని లేదు. ఇది చివరకు వివాదానికి దారితీసింది.
ఇది జరిగిందెక్కడో తెలుసా? హైదాబాద్ యాకుత్‌పురా నియోజకవర్గంలో. ఈ పని చేసింది అక్కడి ఎస్‌ఆర్‌టీ కాలనీ ఉన్న జవహర్ హైస్కూల్. స్కూల్ ప్రధాన ద్వారం జాతీయ జెండాపై మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ నిలబడి ఉన్న ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. కింద గొప్పగా జవహర్ హై స్కూల్ అని రాసుకుంది.
స్కూల్ వికారం గురించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైస్కూల్ యజమాని అయూబ్‌ఖాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఇన్‌స్పెక్టర్ ఎం.ఎ. జావెద్ తెలిపారు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.